![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -650 లో......కావ్య ఫ్రూట్స్ బాస్కెట్ లో సర్దుతుంటే అప్పుడే రాజ్ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు మీకు మూడ్ రావాలంటే ఏ బూత్ బంగ్లాకో వెళ్ళాలి కదా అందుకే అని కావ్య అంటుంది. ఏయ్ అంటూ కావ్యపై రాజ్ అరుస్తాడు. నాకు నెల తప్పాలని ఉంది.. స్వప్న అక్కలాగా నాకూ ఒక బిడ్డని కనాలని ఉందని కావ్య అనగానే.. నాకు నువ్వు నెల తప్పాలని ఉందంటూ కావ్య దగ్గరగా రాజ్ వస్తాడు. కావ్యని రాజ్ ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు.
మరుసటి రోజు కళ్యాణ్ నిద్ర లేవగానే ఒక ప్రొడ్యూసర్ కాల్ చేసి నీకు ఒక సినిమాలో ఆల్ సాంగ్స్ కి రాసేలా ఛాన్స్ ఇస్తున్నా అంటాడు. అలా కుదరదు అండి మా గురువు గారికి మాటిచ్చానని కళ్యాణ్ అనగానే మీ గురువు గారు చెప్పారు. అందుకే నీకు ఛాన్స్ ఇస్తున్నాను.. కావాలంటే మీ గురువు గారికి ఫోన్ చేసి నాకు మళ్ళీ చెయ్ అని ప్రొడ్యూసర్ అంటాడు. దాంతో కళ్యాణ్ లిరిక్ రైటర్ లక్ష్మికాంత్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒళ్ళంతా దెబ్బలతో పక్కనే అప్పు భయపెడుతుంటే లక్ష్మీకాంత్ ఫోన్ మాట్లాడతాడు. మంచి అవకాశం వచ్చింది ఉపయోగించుకోమని అతను చెప్పగానే కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ విషయం ఇంట్లో అందరికి చెప్పగానే అందరు చాల హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. రాత్రి రాజ్, కావ్య లు కేక్ కటింగ్ ఏర్పాటు చేస్తారు. అప్పు, కళ్యాణ్ లు ఇద్దరు కేక్ కట్ చేస్తారు. అందరు ఇద్దరిని విష్ చేస్తారు.
ఆ తర్వాత అందరు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. రాజ్ కి ఆఫీస్ నుండి కాల్ వస్తుంది. ఎవరికి చెప్పకుండా రాజ్ వెళ్తుంటే అతడిని కావ్య చూస్తుంది. తరువాయి భాగం లో అప్పు కానిస్టేబుల్స్ ని తీసుకొని ఇంటికి వస్తుంది. నిన్నటి నుండి సామంత్ కన్పించడం లేదని బావపై అనామిక కంప్లైంట్ ఇచ్చిందని అప్పు అంటుంది. కాని స్టేబుల్స్ రాజ్ కార్ లో చెక్ చెయ్యగా అందులో సామంత్ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |